ఎయిరిండియా ప్రైవేటీకరణ..! కేంద్రం చకచకా అడుగులు

ఎయిరిండియా ప్రైవేటీకరణ..! కేంద్రం చకచకా అడుగులు

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీక‌ర‌ణపై ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ముందుకు సాగుతోంది. న‌ష్టాలు, అప్పుల ఊబిలో చిక్కుకున్న ప్రభుత్వ రంగ విమాన‌యాన సంస్థ ఎయిరిండియాను ప్రస్తుత ఆర్థిక సంవ‌త్సరంలోనే ప్రైవేటీక‌రించాల‌ని కేంద్రం విధానాన్ని ఖ‌రారు చేసినా క‌రోనా వ‌ల్ల ఆచ‌ర‌ణ‌ సాధ్యం కాలేదు. మ‌హారాజాగా పేరొందిన ఎయిరిండియాతోపాటు లాభాల్లో ఉన్న కేంద్ర చ‌మురు సంస్థ భార‌త్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్‌ను ప్రైవేటీక‌రించాలని నిర్ణయంచింది. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాద‌న‌ల్లో ఎయిరిండియా,  బీపీసీఎల్‌తోపాటు కాంకర్, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ సంస్థలు కూడా ఉన్నాయి. ఓవైపు.. ప్రతిపక్షాలు, కార్మిక, ప్రజా సంఘాల నుంచి ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వ విధానాన్ని తప్పుబడుతోన్నా.. నష్టాలు, అప్పులు ఉన్నాయని కాబట్టి ప్రైవేటీకరణ తప్పదు అంటోంది కేంద్రం.