పెట్టుబడుల ఉప సంహరణ వివరాల వెల్లడికి కేంద్రం నిరాకరణ...

పెట్టుబడుల ఉప సంహరణ వివరాల వెల్లడికి కేంద్రం నిరాకరణ...

విశాఖ స్టీల్ ప్లాంటులో పెట్టుబడుల ఉప సంహరణ చేపడుతోన్నట్టు పరోక్షంగా మరోసారి స్పష్టం చేసింది కేంద్రం. అయితే విశాఖ స్టీల్ ప్లాంటులో పెట్టుబడుల ఉప సంహరణ వివరాల వెల్లడికి కేంద్రం నిరాకరించింది. తాము చేసిన సిఫార్సులను ఆర్టీఐ ద్వారా సమాచారమిచ్చేందుకు నీతి ఆయోగ్ అంగీకరించలేదు. స్టీల్ ప్లాంటులో పెట్టుబడుల ఉప సంహరణ ప్రక్రియను.. వివరాలను కమర్షియల్ సీక్రెట్ జాబితాలో చేర్చింది కేంద్రం. వివరాలు వెల్లడిస్తే కొనుగోలుగార్ల మధ్య పోటీతత్వానికి దెబ్బ తగులుతుందని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది.