రైతుల‌కు కేంద్రం బంప‌ర్ ఆఫ‌ర్‌...

రైతుల‌కు కేంద్రం బంప‌ర్ ఆఫ‌ర్‌...

కేంద్రం రైతుల కోసం తీసుకొచ్చిన రైతు చట్టాలను దేశంలోని అనేక ప్రాంతాల రైతులు వ్యతిరేకిస్తున్నారు.  గత రెండు నెలలుగా రైతులు ఢిల్లీలో చలిని, వర్షాన్ని లెక్కచేయకుండా నిరసనలు చేస్తున్నారు.  ఇప్పటికే 9సార్లు కేంద్రం రైతు సంఘాలతో చర్చలు జరిపింది.  ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి కనిపించలేదు.  వ్యవసాయ చట్టాల్లో మార్పులు చేస్తామని కేంద్రం చెప్తున్నా రైతులు ససేమిరా అంటున్నారు.  మూడు చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె, కేంద్రం ఓ మెట్టు దిగివచ్చి రైతు చట్టాలను ఏడాది పాటు నిలిపివేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.  రైతులతో చట్టాల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతుండటంతో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.  మరి ఈ ప్రతిపాదనలను రైతు సంఘాలు ఎంతవరకు ఆమోదిస్తాయో చూడాలి.