సుప్రీంకోర్టు సూచన.. అయోధ్య ట్రస్ట్ ఏర్పాటుకు కసరత్తు..

సుప్రీంకోర్టు సూచన.. అయోధ్య ట్రస్ట్ ఏర్పాటుకు కసరత్తు..

సుప్రీంకోర్టు ధర్మాసనం అయోధ్యపై తీర్పు వెలువరించిన సందర్భంగా చేసిన సూచనలు అమలు చేసేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది.. వివాదాస్పదంగా మారిన స్థలం మొత్తం రామామందిరానికే చెందుతుందని ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది.. రామ మందిరం నిర్మాణానికి వెంటనే ట్రస్టు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సూచించింది అత్యున్నత న్యాయస్థానం... ఇక, ట్రస్ట్ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే అయోధ్య ట్రస్టు బిల్లును సభలో ప్రవేశపెట్టే విధంగా అడుగులు వేస్తోంది.. కాగా. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే.