బ‌డ్జెట్ ప‌త్రాలు ముద్రించ‌డంలేదు.. ఇదే తొలిసారి..!

బ‌డ్జెట్ ప‌త్రాలు ముద్రించ‌డంలేదు.. ఇదే తొలిసారి..!

క‌రోనా వైర‌స్ అంతా మార్చేసింది.. స్కూల్‌కు వెళ్లే అవ‌స‌రం లేకుండా ఆన్‌లైన్ క్లాసులు తెచ్చింది.. ఆఫీసుకు పోయే ప‌నిలేకుండా వ‌ర్క్ ఫ్రం హోం తీసుకొచ్చింది.. క్యాష్ వినియోగాన్ని కూడా త‌గ్గింది డిజిట‌ల్ పేమెంట్స్ పెరిగేలా చేసింది.. ఒక్క‌టేంటి.. ఇలా చెబుతో పోతే లిస్ట్ చాలా పెద్ద‌దే.. అయితే, క‌రోనా ఎఫెక్ట్ ఇప్పుడు కేంద్ర బ‌డ్జెట్‌ను కూడా తాకేసింది.. తొలిసారి బ‌డ్జెట్ ప్ర‌తుల‌ను ముద్రించ‌కూడ‌ద‌నే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది కేంద్రం.. దీనికి ఇప్ప‌టికే పార్ల‌మెంట్‌ ఉభ‌య స‌భ‌ల నుంచి కూడా ఆమోదం ల‌భించింది. క‌రోనా నేప‌థ్యంలో 100 మందికిపైగా వ్య‌క్తుల‌ను 15 రోజుల పాటు ప్రింటింగ్ ప్రెస్‌లో ఉంచ‌లేమ‌ని ఆర్థిక శాఖ చెప్ప‌డంతో కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకుంది. అంటే ఈ సారి బ‌డ్జెట్ ప్ర‌తుల ముద్ర‌ణ ఉండ‌ద‌న్న‌మాట‌.. బ‌డ్జెట్‌కు సంబంధించిన‌ సాఫ్ట్ కాపీల‌ను స‌భ్యులంద‌రికీ అందుబాటులో ఉంచుతామ‌ని ప్ర‌భుత్వం తెలిపింది. ఫిబ్ర‌వ‌రి 1న కేంద్ర బ‌డ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌న‌వ‌రి 29 నుంచి ఏప్రిల్ 8 వ‌ర‌కు రెండు విడ‌త‌లుగా జ‌ర‌గ‌నుండ‌గా.. తొలి విడ‌త‌లో జ‌న‌వ‌రి 29 నుంచి ఫిబ్ర‌వరి 15వ తేదీ వ‌ర‌కు.. రెండో విడ‌త మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వ‌ర‌కు పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల‌ను నిర్వ‌హించ‌నున్నారు.