కొడుక్కి నిద్ర మాత్రలిచ్చి... కోడలితో మామ

కొడుక్కి నిద్ర మాత్రలిచ్చి... కోడలితో మామ

హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. పానిపట్‌కి చెందిన ఓ వ్యక్తి సొంత కోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కూతురిలా చూసుకోవాల్సిన కోడలితో కామకోరికలు తీర్చుకునేవాడు. కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇద్దరూ రహస్యంగా రాసలీలలు సాగించారు. అయితే తమ అక్రమ సంబంధానికి కుటుంబం అడ్డుగా ఉందని భావించారు. ఇంట్లో నుంచి వెళ్లిపోతే తమకు ఎలాంటి అడ్డంకులు ఉండవని భావించి అత్యంత నీచానికి పాల్పడ్డారు. ఇంట్లో కుటుంబ సభ్యులకు మామ, కోడలు ఆ రోజు రాత్రి భోజనంలో నిద్రమాత్రలు కలిపారు. కొడుకుతో సహా కుటుంబ సభ్యులు అంతా ఆ నిద్రమాత్రలు కలిపిన భోజనం తిన్నారు. అంతే వారంతా నిద్రలోకి జారుకున్న తర్వాత మామ కోడలు ఇంటి నుంచి పరారయ్యారు. అంతా నిద్ర లేచి చూసే సరికి మామ కోడలు పసిబిడ్డ కనిపించకుండా పోయారు. దాంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు చుట్టుపక్కల సీసీకెమెరాల ఫుటేజీ పరిశీలించడంతో మామాకోడలు పరారవుతున్న దృశ్యాలు కనిపించాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వివాహేతర సంబంధంతోనే వారు ఇంటి నుంచి వెళ్లిపోయారని పోలీసులు నిర్ధారించారు.