మధ్య ఆసియా శాంతి పాటించాలి

మధ్య ఆసియా శాంతి పాటించాలి

న్యూయార్క్: మధ్య ఆసియాలో శాంతిని ఉంచమని, ఎటువంటి ఉద్రిక్తలకు తావు ఇవ్వొద్దని ఇరాన్‌ను యూఎన్ కోరుతోంది. అయితే ఒక ఇరానియన్ శాస్త్రవేత్త హత్య చేయబడటంతో కోపగించిన ఇరాన్‌ను దృష్టిలో పెట్టుకొని యూఎన్ సెక్రటరీ జనరల్ ఈ మాటలు అన్నారు. మేము జరిగిన విషాదం గురించి తెలుసుకున్నామని అన్నారు. ‘ఇరాన్ న్యూక్లియన్ శాస్త్రవేత్త హత్యకు గురైన విషయం తెలిసింది. దాని గురించిన రిపోర్టును కూడా చూశాం. నేడు టెహ్రాన్‌లో జరగింది దారుణం. కానీ మనం శాంతిని నెలకొల్పాలి, ఎటువంటి ఉద్రిక్తలకు చోటును ఇవ్వకండి. అంతేకాకుండా దేశంలో గొడవలకు దారితీసే ఎటువంటి చర్యలు తీసుకోవద్ద’ని ఫర్హాన్ హక్ అన్నారు. అయితే తన పరిశాధన జట్టులోని ఒక న్యూక్లియర్ శాస్త్రవేత్త హత్యకు గురయ్యాడని ఇటీవల ఇరాన్ రక్షణ శాఖ తెలిపింది. దీనికి కారణం ఇస్తాయిలేనని, పక్క దేశాల వారిని చంపి మళ్లీ దానిపై సంతాపం చూపడం సరైన పద్దతి కాదని, ఇది రాజ్య ధోషమని ఇరాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ జవాద్ షరీఫ్ అన్నారు. మరి ఈ విషయం ఎంత వరకు పోతుందో అని ఇరుదేశాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. యూఎన్ మాత్రం శాంతిగి పరిష్కరించుకుందామని నచ్చచెప్పే ప్రయత్నాలు చేస్తోంది.