భారతీయులకు శుభవార్త..వీసా గడువు జూలై 31 వ‌ర‌కు పెంపు

భారతీయులకు శుభవార్త..వీసా గడువు జూలై 31 వ‌ర‌కు  పెంపు

బ్రిటన్‌లో చిక్కుకున్న వేలాది భారతీయులకు కాస్త ఊరట లభించింది...వివిధ రకాల వీసాలపై బ్రిటన్‌ వెల్లి కరోనా లాక్‌డౌన్‌లో చిక్కుకున్న భారతీయులకు శుభవార్త చెప్పింది బ్రిటిష్ ప్రభుత్వం..విదేశీయుల అన్ని రకాల వీసాల‌ గడువును జూలై 31 వ‌ర‌కు పెంచుతున్నట్టు యూకే ప్రకటించింది..మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టే క్ర‌మంలో దేశంలో కొన‌సాగుతున్న లాక్‌డౌన్ కార‌ణంగా యూకేలో ఉంటున్న‌ విదేశీయులు, పౌరులు అసౌక‌ర్యానికి గురికాకుండా ఉండేందుకు వారి వీసా గ‌డువును జూలై వ‌ర‌కు పెంచింది..మార్చి 31వ తేదీ త‌ర్వాత వ‌ర‌కు గ‌డువు ముగిసిన అందిరికీ ఈ పెంపు వ‌ర్తిస్తుంద‌ని యూకే అధికారులు పేర్కొన్నారు.

ఈ సమయంలో ప్రజలకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం తీసుకున్న అపూర్వమైన చర్యలలో ఇది ఒకటి అయినప్పటికీ, ప్రస్తుతం యూకేలో గడువు ముగిసిన ,సందర్శకుల వీసాలపై ఉన్నవారు వీలైనంత త్వరగా ఇంటికి తిరిగి రావాలి భారతీయ సంతతి క్యాబినెట్ మంత్రి అన్నారు.జూలై 31లోపు ఇంటికి చేరుకోలేని వారందరికీ సహాయం చేయడానికి పొడిగింపును అందిస్తున్నప్పటికీ, ప్రస్తుతం యూకేలో తాత్కాలిక వీసాలైన విజిటర్ వీసాలు ఉన్నవారు సురక్షితంగా మరియు సాధ్యమైనంత త్వరగా ఇంటికి తిరిగి రావాలని హోమ్ ఆఫీస్ తెలిపింది..భారతదేశంలో అత్యవసర పరిస్థితి ఉన్న OCI కార్డుదారులు మరియు విశ్వవిద్యాలయ విద్యార్థులు ఇప్పుడు రావడానికి అనుమతి ఇచ్చింది..