అయోధ్య రామమందిరం నిర్మాణంలో ఉడిపి నుంచి మట్టి... ఎందుకంటే... 

అయోధ్య రామమందిరం నిర్మాణంలో ఉడిపి నుంచి మట్టి... ఎందుకంటే... 

అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కోసం ఏర్పాట్లు  చకచకా జరుగుతున్నాయి.  ఈ భూమి పూజ కార్యక్రమాన్ని మూడు రోజులపాటు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  ఆగష్టు 5 వ తేదీన ప్రధానమైన భూమి పూజా కార్యక్రమం ఉంటుంది.  మొత్తం 300 మంది ఈ కార్యక్రమానికి హాజరౌతున్నట్టు తెలుస్తోంది.  ఇక భూమి పూజలో వెండి ఇటులను ఉంచబోతున్నారు.  ఐదు వెండి ఇటుకలను ఈ పూజ కోసం వినియోగిస్తున్న సంగతి తెలిసిందే.  ఇక భూమి పూజ కోసం మట్టిని కర్ణాటకలోని ఉడిపి నుంచి తీసుకొస్తున్నారు.  

ఉడిపిలోని పర్యాయ అడ్మన్ పీఠం మట్టిని సేకరించి ఇత్తడి కలశంలో అయోధ్య ట్రస్ట్ కు అందజేసింది.  ఈ  మట్టిని భూమి పూజ కోసం వినియోగిస్తున్నారు.  అయితే, ఈ పీఠం మఠాధిపతి విశ్వ ప్రసన్న తీర్ధ స్వామీ చాతుర్మాస వ్రతం దీక్షలో ఉన్నందు వలన అయోధ్యలో జరిగే భూమి పూజకు హాజరు కావడం లేదని పీఠం అధికారులు తెలిపారు.