అయోధ్య సభకు ఉద్ధవ్ ఠాక్రే?

అయోధ్య సభకు ఉద్ధవ్ ఠాక్రే?

అయోధ్యలో ఈ నెల 25న జరిగే ధర్మసభకు శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే హాజరయ్యే అవకాశం ఉందని విశ్వహిందూ పరిషత్ నాయకులు చెబుతున్నారు. రామ మందిర్ కోసం ఆర్డనెన్స్ అయినా సరే తీసుకురావాలని ఆర్ఎస్ఎస్ తో పాటు శివసేన కూడా పట్టుబడుతోంది. ఈ క్రమంలో 25న జరిగే భారీ ధర్మసభకు శివసేన అధినేతను కూడా ఆహ్వానిస్తున్నారు. అందుకు ఉద్ధవ్ కూడా అంగీకరించినట్లు సమాచారం. ఒకరోజు ముందే అంటే 24వ తేదీనే ఉద్ధవ్ అయోధ్య చేరుకుంటారని చెబుతున్నారు. సాధుసంతులు, వీహెచ్పీ నాయకులు, పలు రాష్ట్రాల నుంచి వివిధ హిందూ సంఘాల ప్రముఖులు అయోధ్యలో ధర్మసభకు హాజరయ్యే అవకాశం ఉంది. మందిర్ కోసం కేంద్రంలోని బీజేపీ సర్కారు మీద ఒత్తిడి తేవడమే లక్ష్యంగా ఈ సభ జరుగుతుందని వారంటున్నారు.