వీసాలను రద్దు చేసిన యూఏఈ

వీసాలను రద్దు చేసిన యూఏఈ

ఇస్లామాబాద్: కరోనా మళీ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది. దాంతో ప్రపంచ దేశాలు కరోనాను అడ్డుకునేందుకు వివిధ ప్రణాళికలను సిద్దం చేస్తున్నియి. దీనికి సంబంధించి యూఏఈ నూతన నిర్ణయం తీసుకుంది. పాకీస్తాన్ సహా 11 దేశాల విసిటింగ్ వీసాలను తాత్కాళికంగా రద్దు చేసింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ విదేశాంగ అధికారి ఖరారు చేశారు. అయితే ఈ విసిటింగ్ వీసాల రద్దు కేవలం కరోనా సెకండ్ వేవ్‌ వల్లేనని, కరోనా నుంచి దేశ ప్రజలను కాపాడేందుకే యూఏఈ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ‘యూఏఈ పాకిస్తాన్ సహా 11దేశాల విసిటింగ్ వీసాలను రద్దు చేసిన సమాచారం మాకు అందింది. దానికి కారణం కరోనా అని కూడా వారు తెలిపార’ని పాకిస్తాన్ విదేశాంగ్ అధికారి జాహిద్ హఫీజ్ అన్నారు. పాకీస్తాన్‌, టర్కీ, ఇరాన్, యామెన్, సిరియా, ఇరాక్, సోమాలియా, లిబ్యా, కెన్యా, ఆప్ఘనిస్తాన్ మరి కొన్ని దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మార్పుకు కారణం దేశాలలో కరోనా విజృంభనేనని అంటున్నారు. ఒక్క వారంలో పాకిస్తాన్‌లో 2 వేల కొత్త కరోనా కేసులను నమోదయ్యాయి. అయితే జూన్‌ నెలలో కూడా యూఈఏ దేశంలోని అన్ని ప్రయాణాలను నిలిపి వేసిన సంగతి తెలిసిందే.