చరిత్రలో మొదటిసారి: యుద్ధనౌకల్లో మహిళా ఆఫీసర్లు... 

చరిత్రలో మొదటిసారి: యుద్ధనౌకల్లో మహిళా ఆఫీసర్లు... 

దేశంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు.  పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.  ఉద్యోగ, వ్యాపార రంగాలతో పాటుగా దేశరక్షణ విభాగంలో కూడా మహిళలు రాణిస్తున్నారు.  ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నౌకా రంగాల్లో మహిళలను కూడా రిక్రూట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే.  అయితే, యుద్ధ నౌకల్లో ఇప్పటి వరకు పురుషులకు మాత్రమే అవకాశం ఉండేది.  తాజగా, మార్పులు చేసి యుద్ధ నౌకల్లో సైతం మహిళలకు అవకాశం కల్పించారు.  ఇందులో భాగంగా నౌకాదళంలో సబ్ లెఫ్టినెంట్ గా పనిచేస్తున్న కుముది త్యాగి, రీతి సింగ్ లకు అవకాశం దక్కింది.  నేవిలోని బహుళ ప్రయోజనాల హెలికాఫ్టర్లను నడపడంలో శిక్షణ పొందారు.  అదే విధంగా ఇంటిలిజెన్స్, నిఘా పునఃపరిశీలన, సెన్సార్లు ఆపరేటింగ్ లో ఈ మహిళలు శిక్షణ పొందారు.  త్వరలోనే మరికొంతమంది మహిళలను యుద్ధ నౌకల్లోకి తీసుకోబోతున్నట్టు సమాచారం.