అమ్మాయిని ప్రేమించిన మరో యువతి...చివరికి ఇంట్లో నుంచి పరార్ !

అమ్మాయిని ప్రేమించిన మరో యువతి...చివరికి ఇంట్లో నుంచి పరార్ !

కర్నూలు కలకలం ఇద్దరు యువతుల లవ్‌ స్టోరీ కలకలం రేపుతోంది. ఇద్దరం ప్రేమించుకున్నామంటూ ఇంట్లో నుంచి పరారయ్యారు ఆ యువతులు. రూ.50 వేలు తీసుకుని ఇంటి నుంచి జంప్‌ అయ్యారు. ఈ వింత ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు పట్టణంలోని సంతోష్‌ నగర్‌కు చెందిన యువతి(21), నర్సింహరెడ్డి నగర్‌కు చెందిన మరో యువతి (20)చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఏకంగా ఇద్దరు పెళ్లి చేసుకోవాలని సిద్ధపడ్డారు. డిగ్రీ చదువుతున్న నర్సింహరెడ్డి నగర్‌ కు చెందిన అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో పరార్‌ అయినట్లు సమాచారం. పారిపోయే ముందు ఓ లెటర్‌ రాసి మరీ జంప్‌ అయ్యారు. దీంతో కలవరం చెందిన ఆ యువతుల తల్లిదండ్రులు కర్నూల్‌ టీ-టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.