మొన్న టీడీపీకి.. ఇవాళ బీజేపీకి షాక్..!

మొన్న టీడీపీకి.. ఇవాళ బీజేపీకి షాక్..!

శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది... మొన్నటికి మొన్న తెలుగుదేశం పార్టీకి షాక్‌ ఇచ్చిన నలుగురు అభ్యర్థులు.. మంత్రి అప్పలరాజు సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోగా... ఇవాళ ఇద్దరు బీజేపీ అభ్యర్థులు ఆ పార్టీకి షాకిస్తూ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున నామినేషన్‌ వేసిన రమ్య, బాలాజీ గుప్తా ఇవాళ వైసీపీలో చేరారు. మంత్రి అప్పలరాజు.. వారికి పార్టీకి కండువా కప్పి.. వైసీపీలోకి ఆహ్వానించారు. మొత్తంగా మొన్న టీడీపీ నుంచి నలుగురు కౌన్సిలర్ అభ్యర్థులు షాకిస్తే.. ఇవాళ బీజేపీకి ఇద్దరు అభ్యర్థులు షాకిచ్చారు. వీళ్లంతా వైసీపీలో చేరేందుకు మంత్రి అప్పలరాజు అన్నవిధాలుగా ప్రయత్నాలు చేసినట్టు టాక్ నడుస్తోంది.