ఆ ఇద్దరు హీరోలకు భారతరత్న ఇవ్వాలి

ఆ ఇద్దరు  హీరోలకు భారతరత్న ఇవ్వాలి

కరోనా మహమ్మారి దేశాన్ని పట్టిపీడిస్తున్న నేపథ్యంలో సినీ తారలందరూ తమవంతు సాయం చేశారు. అయితే, బాలీవుడ్‌ నటులు అక్షయ్‌కుమార్‌, సోనూసూద్‌లు విరాళాలు ఇవ్వడమే కాకుండా ఎంతోమంది వలస కార్మికులకు సాయం చేశారు.  దాంతో ఈ క్లిష్ట కాలంలో రియల్ హీరోలు అనిపించుకున్న అక్షయ్ , సోనూసూద్ లకు  భారతరత్న ఇవ్వాలని సోషల్ మీడియాలో రిక్వెస్ట్ లు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని సహాయనిధికి అక్షయ్‌ భారీగా రూ.25కోట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక నటుడు సోనూసూద్‌ ఎంతోమంది వలస కార్మికులకు తనవంతు సాయం అందజేశారు.తన ఖర్చులతో బస్సులు ఏర్పాటు చేశాడు. మరికొందరికి రైలు టికెట్లు ఇచ్చి పంపాడు. ఈ నేపథ్యంలో వీరికి భారతరత్న ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం ప్రచారం జరుగుతుంది