ట్రంప్ దిగిపోయాక ట్విట్టర్ ఆ పని చేస్తుందట... 

ట్రంప్ దిగిపోయాక ట్విట్టర్ ఆ పని చేస్తుందట... 

యూఎస్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే.  ఎన్నికల్లో అమెరికా ప్రజలు డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్ కు అధికారం అప్పగించారు.  2021, జనవరి 20 వ తేదీన మధ్యాహ్నం సమయంలో జో బైడెన్ 46 వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తారు.  ఇక ఇదిలా ఉంటె, మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ ఓ నిర్ణయం తీసుకుంది.  అమెరికా అధ్యక్షుడి అధికారిక ట్విట్టర్ ఖాతాను ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ నుంచి కొత్త అధ్యక్షుడు జో బైడెన్ కు బదలాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.  జో అధ్యక్షుడిగా అధికారం స్వీకరించిన వెంటనే అయనకు అమెరికా అధ్యక్షుడి ట్విట్టర్ ఖాతాను అందజేస్తామని ట్విట్టర్ తెలిపింది.  2017 లో ఒబామా నుంచి ట్రంప్ కు అధికారిక ఖాతాను బదలాయించింది.  2021లో ట్రంప్ నుంచి జో బైడెన్ కు అమెరికా అధ్యక్షుడి అధికారిక ఖాతాను బదలాయిస్తుంది.