కళ్యాణమస్తు కార్యక్రమానికి ముహుర్తాలు ఖరారు !

కళ్యాణమస్తు కార్యక్రమానికి ముహుర్తాలు ఖరారు !

టీటీడీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించే కళ్యాణమస్తు కార్యక్రమానికి ముహుర్తాలు ఖరారు చేశారు పండితులు. కళ్యాణమస్తు లగ్నపత్రికని స్వామివారి పాదాల చెంత వుంచి పూజలు నిర్వహించారు అర్చకులు. మే 28,అక్టోబర్ 30వ తేది, నవంబర్ 17వ తేదిలలో కళ్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఇఓ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. కళ్యాణమస్తు నిర్వహించే ప్రాంతాలను పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. స్వామి వారికి ఏడాదికి రూ.2 వేల కోట్ల వరకు కానుకలు వస్తుంటాయి. టిటిడి ఏటా రూ.200 కోట్ల రూపాయలను వెచ్చించి హిందు ధార్మిక ప్రచారం నిర్వహిస్తుంది. అందులో భాగంగా 2007లో టిటిడి అట్టహాసం గా ఈ కళ్యాణమస్తు  కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ  కార్యక్రమాన్ని గతంలో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించింది. కల్యాణమస్తు కార్యక్రమంలో భాగంగా, పెళ్ళి చెసుకునే జంటలకు 2 గ్రాముల బంగారంతో మంగళసూత్రాలతో పాటు వస్ర్తాలను ఉచితంగా అందజేసింది. వధూవరులుతో పాటు 50 మందికి ఉచితంగా భోజనం సరఫరా చేసింది టిటిడి. ఇలా ఒక్క జంట వివాహానికి 8 వేల రూపాయలు వరకు ఖర్చు చేసేది టిటిడి. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రతి ధపా ఐదు వేల నుంచి 7 వేల వరకు జంటలు పాల్గొనేవి. 2011 మార్చిలో రద్దయిన ఈ పధకాన్ని ఇప్పటి పాలకమండలి తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.