టీటీడీ ఈవో అనిల్‌ కుమార్ సింఘాల్ బదిలీ..

టీటీడీ ఈవో అనిల్‌ కుమార్ సింఘాల్ బదిలీ..

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా ఉన్న అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ను బదిలీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా సింఘాల్‌ను నియమించింది సర్కార్.. టీటీడీ ఏఈవో ధర్మారెడ్డికి ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. సుదీర్ఘకాలంపాటు టీటీడీ ఈవోగా కొనసాగారు అనిల్ కుమార్ సింఘాల్.. కొద్దిరోజుల్లోనే మరో అధికారిని టీటీడీ ఈవోగా నియమించే అవకాశం ఉంది. అయితే, గరుడు సేవ రోజు తిరుమలలో జరిగిన ఘటనలు, డిక్లరేషన్‌కు సంబంధించిన అంశాల నేపథ్యంలోనే ఈవోపై బదిలీవేటు వేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక, అనిల్‌ కుమార్ సింఘాల్ 1993 బ్యాచ్ చెందిన ఐఏఎస్‌ అధికారి.