అలాస్కాలో భారీ భూకంపం: సునామి హెచ్చరికలు... 

అలాస్కాలో భారీ భూకంపం: సునామి హెచ్చరికలు... 

అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో భారీ భూకంపం సంభవించింది.  ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.8 గా నమోదైంది.  అలస్కాకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫెర్రీవిల్లే కేంద్రంగా ఈ  భూకంపం సంభవించినట్టు అధికారులు గుర్తించారు.  రిక్టర్ స్కేల్ పై 7.8గా నమోదు కావడంతో వెంటనే సునామి హెచ్చరికలు జారీ చేశారు.  భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలను అలర్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తున్నారు.  భూకంపం సంభవించిన వెంటనే హెలికాఫ్టర్ల ద్వారా సైరన్లు మోగిస్తూ ప్రజలను అలర్ట్ చేసింది ప్రభుత్వం.