హైదరాబాద్‌లో రోడెక్కిన బస్సులు.. తొలిరోజు ఇలా...

హైదరాబాద్‌లో రోడెక్కిన బస్సులు.. తొలిరోజు ఇలా...

లాక్‌డౌన్‌తో సర్వం బంద్‌ కావడంతో.. రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయింది.. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి... ఇక, సడలింపుల తర్వాత.. జిల్లా సర్వీసులు తిరిగినా హైదరాబాద్‌ సర్వీసులు మాత్రం రోడ్డెక్కలేదు.. ఇక మొన్నటి నుంచి సిటీ శివారు ప్రాంతాల్లో బస్సులు నడవగా.. ఇవాళ హైదరాబాద్‌లో బస్సులు రోడ్డెక్కాయి. దాదాపు అన్ని రూట్లలో 25శాతం బస్సులు ప్రారంభమయ్యాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో మొత్తం 29 బస్సు డిపోలుండగా.. 2,800 బస్సులున్నాయి. వీటిలో 25 శాతం బస్సులను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆపరేట్ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రతీ డిపోకు 35 బస్సుల చొప్పున నడుపుతున్నారు. మొదటి రోజు తమకు కేటాయించిన వాటిలో సగం బస్సులను మాత్రమే రోడ్డెక్కించనున్నారు. సిటీ బస్సులతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా సర్వీసులను పునరుద్ధరించారు. ఏపీకి మాత్రం ఇంకా ప్రారంభించలేదు.