టీఎస్ ఎంసెట్ ఫలితాలు విడుదల..

టీఎస్ ఎంసెట్ ఫలితాలు విడుదల..

ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన గందరగోళంతో ఆలస్యమైన తెలంగాణ ఎంసెట్ 2019 ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ అనుబంధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎంసెట్‌-2019 పరీక్ష ఫలితాలను జేఎన్‌టీయూ హైదరాబాద్‌ లో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి, జేఎన్‌టీయూ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ యాదయ్య విడుదల చేశారు. కాగా, టీఎస్ ఎంసెట్ మే 3 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించారు. ఈ పరీక్షలకు 1.31 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మే 11 న ఎంసెట్ ప్రాథమిక కీ విడుదల చేసిన అధికారులు... మే 13 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. కాసేపటి క్రితమే ఎంసెట్ ఫలితాలు విడుదల చేశారు.