ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం

ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం

తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. అయితే అందరూ అనుకున్నట్టు రాజకీయంగా ఆసక్తికరమైన అంశాలేవీ ప్రకటించలేదు. కేవలం ప్రభుత్వపరంగా తీసుకున్న నిర్ణయాలతోనే సరిపెట్టారు. మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్ రావు కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు. గోపాలమిత్రుల వేతనాన్ని రూ. 3500- రూ. 8500 పెంచారు. అర్చకుల రిటైర్మెంట్ ఏజ్ ను 58-65 ఏళ్లకు పెంచారు. ఆశావర్కర్ల వేతనం 6 వేల -7500 కు పెంచారు. ఇక 50 శాతం పైబడిన బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల కోసం 71 ఎకరాల భూమి కేటాయించడమే గాక భవనాల నిర్మాణం కోసం రూ. 70 కోట్లు కేటాయించినట్లు మంత్రులు చెప్పారు. రెడ్డి హాస్టల్ భవనానికి మరో 5 ఎకరాల భూమిని అదనంగా కేటాయిస్తున్నట్టు చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖలో 9 వేల మందికి వేతనాల పెంచుతూ నిర్ణయించారు. సెకండ్ ఏఎన్ఎంలకు ఒక్కొక్కరికి రూ. 21 వేల వేతనం చేశారు. అలాగే కాంట్రాక్టు వైద్యుల వేతనాన్ని రూ. 40 వేలకు పెంచారు. 

త్వరలో మరో కేబినెట్ భేటీ: కడియం
ఇక ఉప ముఖ్యమంత్రిర కడియం శ్రీహరి త్వరలో మరో కేబినెట్ భేటీ ఉంటుందని ప్రకటించారు. దీంతో రాజకీయపరమైన నిర్ణయాలు ప్రస్తుతానికి ఉండే అవకాశం లేదని భావిస్తున్నారు.