ట్రంప్ మరో కీలక నిర్ణయం: ఈనెల 28 న ప్రకటన... 

ట్రంప్ మరో కీలక నిర్ణయం: ఈనెల 28 న ప్రకటన... 

అమెరికా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాక ట్రంప్ మీడియాలో ఫోకస్ కాలేదు.  ఆయనపై సెనేట్ లో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోవడంతో ట్రంప్ నిర్దోషిగా బయటపడ్డారు.  ఆ సమయంలో ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.  అమెరికన్ల కోసం పోరాటం చేస్తానని పేర్కొన్నారు.  కాగా, ఈనెల 28 వ తేదీన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ జరగబోతున్నది.  ఆ రోజున మాజీ అధ్యక్షుడు ట్రంప్ రాజకీయాలపై కీలకమైన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నది.  2024లో జరిగే అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను కొందరు రిపబ్లికన్లు వ్యతిరేకించినా, ట్రంప్ కు పార్టీలో గట్టి మద్దతు ఉందని సర్వేలో తేలింది.  దీంతో 2024 లో అయన మరొకసారి ఎన్నికల్లో పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.