వలసలు ఆపేందుకు ట్రంప్ కొత్త ప్లాన్..! తెలిస్తే షాకే..!

వలసలు ఆపేందుకు ట్రంప్ కొత్త ప్లాన్..! తెలిస్తే షాకే..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరే వేరు.. పలు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ, సోషల్ మీడియాలో వేదికగా ఆయన స్పందించే తీరుగానీ కొన్ని దేశాలనే గందరగోళంలో పడేస్తుంటాయి.. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను కూడా ప్రభావితం చేస్తాయి. అయితే, వలసలతో నిర్మితమైన అమెరికాకు వలసల్ని ఆపేయడతమే లక్ష్యంగా పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు.. ఇప్పటికే అమెరికా-మెక్సికో సరిహద్దులో భారీ ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. అయినా వలసలు ఆగకపోవడంతో ఆయన బుర్రకు కొత్త ఐడియా తట్టింది. సరిహద్దుల్లో ఎలక్ట్రిక్ తీగలు అమర్చి వాటిపై ముళ్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు ట్రంప్.. అంతే కాదు.. ఆ లైన్‌కు కొద్ది దూరంలో నీటి కాలువ తవ్వి అందులో పాములు, మొసళ్లు వేయనున్నట్టు వ్యాఖ్యానించారు అమెరికా అధ్యక్షుడు. అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. 

అయినా వలసలు ఆకపోతే ఏంచేయాలన్నదానిపై కూడా ఆగ్రహంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు ట్రంప్.. వలసవాదులు కంచె దాటే ప్రయత్నం చేస్తే వారి కాళ్లను కాల్చేయాలని, కంచెపై మానవ మాంసపు వ్యర్థాల్ని వేయాలంటూ ఊగిపోయారట.. ఆయను సముదాయించడానికి అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన అలాగే వ్యాఖ్యానించారట.. దీంతో అరగంటలో ముగియాల్సిన సమావేశం కాస్తా.. 2 గంటలకు పైగా జరిగిందంటూ అమెరికన్ మీడియా పేర్కొంది. వలసలు ఆగకపోవడంతో అధికారులను కూడా టార్గెట్ చేశారు ట్రంప్.. మీరు కఠినంగా వ్యవహరించడంలేదు.. మీరు పనికిరారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారట. మొత్తానికి వలసలు ఆపడానికి ఆయన చేసిన ఆలోచనతో మరోసారి అంతర్జాతీయంగా హాట్ టాఫిక్ అయ్యారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.