23 హైస్పీడ్ రైళ్లను ఆపేసిన పక్షి...
మనిషికి మాత్రమే భావోద్వేగాలు ఉంటాయని అనుకుంటే పొరపాటే... మనిషికి మాత్రమే కాదు ప్రతి ప్రాణికి భావోద్వేగాలు ఉంటాయని అందరికి తెలుసు. చివరకు మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది... భావోద్వేగాలు ఉంటాయి. స్పందిస్తుంటాయి. ఇక ఇదిలా ఉంటె, జర్మనీలో బాతు జాతికి చెందిన రెండు పక్షులు ఆకాశంలో విహరిస్తుండగా, విద్యుత్ తీగలు తగిలి ఒక బాతు మృతి చెందింది. తోడు కోల్పోవడంతో ఒంటరైన మరో బాతు రైలు పట్టాలపై దీనంగా తిరుగుతూ కనిపించింది. వెంటనే స్పందించిన అధికారులు ఆ మార్గంలో వెళ్లే రైళ్లను నిలిపివేసి బాతును పట్టుకొని దగ్గరలో ఉన్న కొలనులో వదిలిపెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)