రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

టీఆర్ఎస్ తమ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు టిఆర్ఎస్ అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్ కె.కేశవరావు, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డిలను తమ అభ్యర్థులుగా ప్రకటించారు. టీఆర్ఎస్ అభ్యర్థులిద్దరూ శుక్రవారం తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు .తమను రాజ్యసభ అభ్యర్థులుగా నిర్ణయించినందుకు కేశవరావు, సురేష్ రెడ్డి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. వీరిద్దరినీ ముఖ్యమంత్రి అభినందించారు.కాంగ్రెస్ పార్టీ తరుపున  పీసీసీ అధ్యక్షునిగా  పని చేసిన కే.కేశవరావు తెరాస లో చేరి  ఆరేళ్ళ క్రితం తొలిసారి రాజ్యసభకు వెళ్లారు. ఇక కె.ఆర్.సురేష్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో నుంచి తెరాసలోక చేరారు . ఈయన గతం లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా వ్యవహరించారు.