బ్రేకింగ్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత

బ్రేకింగ్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత

సీనియర్ పొలిటీషన్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూశారు... గుండెపోటుతో కాసేపటి క్రితమే హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు నర్సింహయ్య... ఆయన ప్రస్తుతం నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు... ఆయన స్వగ్రామం నకిరేకల్ మండలం పాలెం.. గతంలో సీపీఐ(ఎం)  నుంచి నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎన్నికయ్యారు.. 1999,2004 లో సీపీఎం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. అసెంబ్లీ అనేక సమస్యలను లేవనెత్తారు.. కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఉన్న ఆయన.. సుదీర్ఘకాలం వామపక్ష ఉద్యమాల్లో పనిచేశారు.. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యునిగా కొనసాగారు.. సీపీఎం శాసనససభపక్షనేతగా కూడా పనిచేశారు. 

నర్సింహయ్య అసెంబ్లీలో సమస్యలు ప్రస్తావిస్తూ.. మధ్యలో సామేతలు జోడిస్తూ చేస్తూ ప్రసంగం అందరినీ ఆకట్టుకునేది.. 2009 భువనగిరి ఎంపీగా పోటీచేసి ఓటమి పాలయ్యారు.. కొన్ని వ్యక్తిగత కారణాలతో సీపీఎం పార్టీకి గుడ్‌బై చెప్పిన ఆయన.. 2014లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గంలో ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై నోముల నర్సింహయ్య శాసన సభ్యుడిగా పోటీచేసి పరాజయం పాలయ్యారు. మళ్లీ 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు.. న్యాయవాది అయిన నర్సింహయ్య నల్లకోటు ధరించి కోర్టులో వివిధ కేసుల విచారణ గతంలో చేపట్టి విధులు నిర్వర్తించారు.