టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి స‌వాల్... గుంట భూమి క‌బ్జా ఉన్నా రాజీనామా..!

టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి స‌వాల్... గుంట భూమి క‌బ్జా ఉన్నా రాజీనామా..!

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారం తెలంగాణ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం సృష్టించింది.. ఆరోప‌ణ‌లు, నిర్ధార‌ణ‌లు, మంత్రి ప‌ద‌వి ఊడ‌పీక‌డం, ఆ త‌ర్వాత భ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డం.. మ‌రో ముందుడు వేసి పార్టీ నుంచి కూడా తొల‌గించిన సంగ‌తి తెలిసిందే.. అయితే, ఇవాళ ఈ వ్య‌వ‌హారంలో కొంద‌రు మంత్రుల‌తో పాటు.. మ‌రికొంద‌రు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హాట్ కామెంట్లు చేశారు.. జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డి ఏకంగా ఓపెన్ చాలెంజ్ విసిరారు.. ఈట‌ల వ్య‌వ‌హారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్ల‌కు స్పందించిన ఆయ‌న‌... నన్ను ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజల ముందు  అప్పీల్ చేస్తున్నా.. అరవై ఎకరాలలో గుంట భూమి కబ్జా చేసిన‌ట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి  రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.. జనగామ చౌరస్తాలో అంబేద్కర్ పాదాల వద్ద ముక్కు నేలకు రాసి... రాజీనామా మాత్రం అంబేద్కర్ పాదాల వద్ద ఉంచి.. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు అంద‌జేస్తాన‌న్నారు. దీంతో.. ఇప్పుడు ముత్తిరెడ్డి వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. గ‌తంలో ప‌లు సంద‌ర్భాల్లో ముత్తిరెడ్డిపై ఆరోప‌ణ‌లు రాగా.. ఇప్పుడు ఆయ‌నే స‌వాల్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.