జానా టీఆర్‌ఎస్‌లో చేరితే నా టికెట్‌ ఇచ్చేస్తా..

జానా టీఆర్‌ఎస్‌లో చేరితే నా టికెట్‌ ఇచ్చేస్తా..

కాంగ్రెస్‌ నేత జానారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతానంటే తన టికెట్‌ను త్యాగం చేస్తానని ఆ పార్టీ నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నోముల నర్సింహయ్య చెప్పారు. ఎన్నికలకు వెళ్దామంటూ కాంగ్రెస్‌ నేతలు తోక ముడుచుకుని పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కోటలు కులాడం ఖాయమన్న నోముల.. నాగార్జునసాగర్‌లో జానా రెడ్డిని ఓడించడానికి ప్రజలు తహతహలాడుతున్నారని చెప్పారు. ఇంతకీ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పలేని స్థితిలో ఆ పార్టీ నేతలున్నారని అన్నారు. రైతుబంధు పథకంలో భాగంగా నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో రూ.100 కోట్లను రైతులు డ్రా చేసుకున్నారని.. కాంగ్రెస్‌తో ఇది సాధ్యమయ్యేదా అని ప్రశ్నించారు.