రామ్ హీరోగా త్రివిక్రమ్ మూవీ ....

రామ్ హీరోగా త్రివిక్రమ్ మూవీ ....

రామ్ తో సినిమా చెయ్యాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. రామ్ పెదనాన్న ‘స్రవంతి’ రవికిశోర్ కు త్రివిక్రమ్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. డైరెక్టర్ గా మారిన తరువాత త్రివిక్రమ్ తెరకెక్కించిన మొదటి చిత్రం ‘నువ్వే నువ్వే’ ను నిర్మించింది కూడా ‘స్రవంతి’ రవికిశోరే అన్న సంగతి తెలిసిందే. అంతకు ముందు ఆయన నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రానికి కూడా రైటర్ గా పనిచేసాడు త్రివిక్రమ్. ఆ అనుబంధంతోనే రామ్ తో సినిమా చెయ్యమని త్రివిక్రమ్ ను ఎప్పుడో అడిగారట ‘స్రవంతి’ రవికిశోర్. ఇన్నాళ్టికి త్రివిక్రమ్ … రామ్ తో సినిమా చెయ్యడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. ఇక రామ్ కూడా.. ’40 కోట్ల బడ్జెట్లో ‘జులాయి’ వంటి యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను రూపొందించమని త్రివిక్రమ్ ను కోరాడట. మరి త్రివిక్రమ్ రామ్ కోరికని నెరవేరుస్తాడో లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిదే..