ఆనాడు మహేష్ మాట.. నేడు పవన్ పాట.. త్రివిక్రమ్ ప్రయత్నాలు!

ఆనాడు మహేష్ మాట.. నేడు పవన్ పాట.. త్రివిక్రమ్ ప్రయత్నాలు!

సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ‘అతడు’ ‘ఖలేజా’ సినిమాల తర్వాత వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌ పై అభిమానులతో పాటు పరిశ్రమ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా మొదలు కాకముందే కథ, కథానాయికపై వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ చర్చలోకి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మహేష్-తివిక్రమ్ సినిమాలో ఓ జానపద పాట పడనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘జల్సా’ సినిమాలో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ యాక్షన్ కి.. మహేష్ మాటలతో మ్యాజిక్ చేశాడు త్రివిక్రమ్. సంజయ్ సాహు గూర్చి మహేష్ చెప్పిన మాటలను అభిమానులు ఇప్పటికి మర్చిపోలేదు. కాగా పవన్-త్రివిక్రమ్-మహేష్ మంచి స్నేహితులన్నా విషయం తెలిసిందే. ఆ సన్నిహిత్యంతోనే మహేష్ సినిమాలో పవన్ పాట అందించేందుకు త్రివిక్రమ్ ప్రయత్నాలు చేస్తున్నాడట. ప్రస్తుతం పవన్-రానా సినిమాకి త్రివిక్రమ్ డైలాగ్స్-స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. మే 31న పూజా కార్యక్రమాలతో మహేష్-త్రివిక్రమ్ సినిమా ప్రారంభం కానుంది.