అల వైకుంఠపురం దెబ్బతో ఎన్టీఆర్ సినిమాకు రెమ్యూనరేషన్ పెంచిన త్రివిక్రమ్...

అల వైకుంఠపురం దెబ్బతో ఎన్టీఆర్ సినిమాకు రెమ్యూనరేషన్ పెంచిన త్రివిక్రమ్...

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇటీవల అల వైకుంఠపురం లో సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించారు. ఇక ఈ సినిమాతో దర్శకుడు , హీరో ఇద్దరు 200 కోట్ల వసూళ్ల క్లబ్ లో చేరారు. ఈసినిమా తరవాత ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు. ఈ కాంబోలో వస్తున్న సినిమాకు 'అయినాను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇక త్రివిక్రమ్ అల వైకుంఠపురం లో సినిమా అందుకున్న హిట్ కారణంగా ఎన్టీఆర్ సినిమాకు రెమ్యూనరేషన్ భారీగా పెంచినట్లు సమాచారం. వైకుంఠపురంకు ముందు వరకు 10-15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న త్రివిక్రమ్ హస్తినకు మాత్రం 20 కోట్లు అందుకుంటున్నాడట! ఎన్టీఆర్ కెరియర్లో 30వ సినిమాగా వస్తున్న ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ అదిరిపోయే కథను సిద్ధం చేసాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ తో కలిసి నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకం పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.