దుబాయ్ లో ఆటగాళ్లకు అదే పెద్ద సవాల్...

దుబాయ్ లో ఆటగాళ్లకు అదే పెద్ద సవాల్...

ఐపీఎల్ 2020 మరో మూడు రోజులో ప్రారంభం కానుంది. అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మొదటి మ్యాచ్ లో తలపడనున్నాయి. అయితే ఈ ఐపీఎల్ లో ఆటగాళ్ళు ప్రత్యర్థి జట్టు విసిరే సవాల్ కంటే మరో పెద్ద ఛాలెంజ్ స్వీకరించాల్సి ఉందని ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ అభిప్రాయపడుతున్నాడు. దీనికి సంబంధించి ముంబై ఇండియన్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో ఇక్కడ ఆటగాళ్ల సవాల్ కంటే వాతారణం నుండి ఎదురయ్యే సవాలను ఎదుర్కోవడం చాలా కష్టం అని బౌల్ట్ అన్నాడు. ఇక్కడ 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. దానిని తట్టుకుంటూ ఆడటం చాలా కష్టం అని అన్నాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ నుండి ముంబై జట్టు స్టార్ పేసర్ లసిత్‌ మలింగ వ్యక్తిగత కారణాలతో తప్పుకోవడంతో పేస్ బాధ్యతలు జస్‌ప్రీత్‌ బుమ్రాతో కలిసి బౌల్ట్‌ పంచుకోనున్నాడు.