హిజ్రాతో లవ్, ఎంగేజ్మెంట్... యువతితో పెళ్లి..!
హిజ్రాను ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు... చివరకు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు.. అందినకాడికి దండుకుని.. ఇప్పుడు మరో యువతితో యువకుడు పెళ్లికి సిద్ధమైన ఘటన హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.. తన ప్రియుడు మొహమ్మద్ రియాజ్‌పై హిజ్రా లక్కీరాయి అలియాస్ శీను ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. పంజాగుట్ట పీఎస్ పరిధిలో నివాసం ఉంటున్న లక్కీరాయ్ అనే ట్రాన్స్‌జెండర్ పోలీసులకు చేసిన ఫిర్యాదు ప్రకారం.. మొహమ్మద్ రియాజ్, తాను కొంతకాలంగా ప్రేమించుకున్నాం.. ఏడాదిన్నరగా తనతో తిరిగి భారీ మొత్తంలో డబ్బులు కాజేశాడు.. ఇక తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించడమే కాకుండా.. రెండేళ్ల కిందట 2018లోనే రియాజ్‌తో తనకు ఎంగేజ్మెంట్ కూడా జరిగిందని.. ఇప్పుడు మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకుని.. పెళ్లికి సిద్ధమయ్యాడని పేర్కొంది. తన ప్రియుడు రియాజ్‌ను కఠినంగా శిక్షించాలని ఫిర్యాదు చేసింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)