బైడెన్ విజయంలో విషాదం

బైడెన్ విజయంలో విషాదం

వాషింగ్‌టన్: అమెరికా తన అధ్యక్ష ఎన్నికలను ముగించుకుంది. అంతేకాకుండా కొన్ని రోజుల పాటు ప్రపంచాన్ని ఎంతో టెన్షన్‌కు గురి చేశాయి ఆ ఎన్నికలు. చివరికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై బైడెన్ విజయం సాధించారు. దాంతో విజయోత్సాహంతో ఓ పార్టీను కూడా జరుపుకున్నారు. అయితే ఇదే సమయంలో ఓ విషాదం చోటుచేసుకుంది. ఆ పార్టీలో ఒక్కసారిగా గన్ను పేలిన చప్పుడు వినబడంతో అందరూ ఉలిక్కి పడ్డారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు గుర్తించిన దాని ప్రకారం ఓ 31 సంవత్సరాల వ్యక్తిని ఎవరో కాల్చి హత్య చేసేందుకు ప్రయత్నించారని, సన్నివేశాన్ని ఇంకా క్షుణ్ణంగా పరీశాలిస్తున్నామనీ పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతానికి బాధితుడను హార్బర్‌వ్యూలోని మెడికల్ సెంటర్‌కు తరలించడం జరిగిందని అతడి గాయాలకు ముందుగా చికిత్స చేశారని, అయినప్పటికీ అతడు తీవ్రగాయాల కారణంగా మరణించాడని తెలిపారు. అయితే ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ జరుపుతున్నామని, ఒక చేతి తుపాకీ సంఘటానా స్థలానికి అతి చేరువలో దోరికిందని పోలీసులు తెలిపారు.