రైతులకు కాదు... కార్పొరేట్ వ్యవస్థలకే లాభం... 

రైతులకు కాదు... కార్పొరేట్ వ్యవస్థలకే లాభం... 

ఇటీవలే కేంద్రం రైతులకు సంబంధించిన వ్యవసాయ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదింపజేసింది.  ఈ బిల్లు ద్వారా రైతులకు లాభం చేకూరుతుందని కేంద్రం చెప్తున్నది. దేశంలో రైతులు తమ పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని, కంపెనీలు డైరెక్ట్ గా రైతుల వద్దకు వచ్చి పంటను కొనుగోలు చేస్తాయని కేంద్రం చెప్తున్నది.  అయితే, దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.  రైతులకు వ్యతిరేకంగా బిల్లును తీసుకొచ్చారని, ఇది రైతు బిల్లు కాదని, కార్పొరేట్ వ్యవసాయ బిల్లుగా కాంగ్రెస్ నేత, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కార్పొరేట్ దిగ్గజాలు అంబానీ, అదానీలకు లాభం చేకూర్చే విధంగా బిల్లు ఉందని ఉత్తమ్ పేర్కొన్నారు.  రైతుల వద్ద నుంచి ప్రైవేట్ కంపెనీలు ఎలా పంటను కొనుగోలు చేస్తాయో చెప్పలేదని, మద్దతు ధర విషయం కూడా ప్రస్తావించలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.  ఈ బిల్లు వలన రైతులకు ఎలాంటి లాభం ఉండదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.