అందులో ధోని మొదటి స్థానం... కోహ్లీ..?

అందులో ధోని మొదటి స్థానం... కోహ్లీ..?

భారత క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని కి ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికి తెలుసు. కానీ గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ తర్వాత ధోని మళ్ళీ క్రికెట్ ఆడలేదు. మార్చిలో జరిగే ఐపీఎల్ తో క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వాలి అనుకున్న కరోనా కారణంగా అది వాయిదా పడింది. ఈ లాక్ డౌన్ లో రాంచీ లోని తన ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేస్తూ గడిపాడు. అయితే ఈ మధ్య  జరిగిన ఐపీఎల్ పాలకమండలి సమావేశం తర్వాత సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు ఐపీఎల్ 2020 జరగనుంది అని బీసీసీఐ తెలిపింది. దాంతో ఈ ఐపీఎల్ లో బాగా రాణించి మళ్ళీ భారత జట్టులో చోటు సంపాదించాలని ధోని భావిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటె ఓర్మాక్స్‌ మీడియా సంస్థ మన భారత్‌లో అత్యధిక ప్రజాదరణ పొందిన 10 మంది క్రీడాకారుల జాబితాను విడుదల చేసింది. అందులో మొత్తం 8 మందు భారత క్రీడాకారులు ఉండగా ఇద్దరు విదేశీయులు ఉన్నారు. ఇక ఈ జాబితాలో మొదటి స్థానం లో ఎంఎస్‌ ధోని ఉండగా భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రెండవ స్థానంలో ఉన్నాడు. ఇక ఆ తర్వాత సచిన్ టెండూల్కర్, రోహిత్‌ శర్మ, క్రిస్టియానో రొనాల్డొ, సానియా మీర్జా, లియోనెల్ మెస్సీ, యువరాజ్‌ సింగ్‌, సౌరవ్‌ గంగూలీ, చివరిగా హార్ధిక్‌ పాండ్యా వరుసగా 10 స్థానాల్లో ఉన్నారు.