లాథమ్‌ తొలి డబల్ సెంచరీ...

లాథమ్‌ తొలి డబల్ సెంచరీ...

వెల్లింగ్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో న్యూజిలాండ్‌ ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌ డబల్ సెంచరీ (200; 412 బంతులు) చేసాడు. టెస్టు క్రికెట్ లో లాథమ్‌కి ఇది తొలి డబల్ సెంచరీ. లంక బౌలర్ డిసిల్వా వేసిన బంతిని స్క్వేర్ లెగ్ దిశగా పంపి సింగిల్ తీయడంతో డబల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. లాథమ్‌ డబల్ సెంచరీతో న్యూజిలాండ్‌ మొదటి ఇన్నింగ్స్ లో పటిష్ట స్థితిలో నిలిచింది. ఇప్పటికే కివీస్ జట్టు 240 పరుగుల ఆధిక్యంలో ఉంది. లాథమ్‌కి తోడు కెప్టెన్‌ విలియమ్సన్‌ (91), రాస్‌ టేలర్‌ (50), నికోల్స్ (50) అర్ధశతకాలతో  అదరగొట్టడంతో న్యూజిలాండ్‌ భారీ స్కోరు దిశగా సాగుతోంది. లంక తన తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులకు ఆలౌటైంది.