సుకుమార్ కుమార్తె ఓణీల ఫంక్షన్ లో తారల సందడి!

సుకుమార్ కుమార్తె ఓణీల ఫంక్షన్ లో తారల సందడి!

ప్రముఖ దర్శకుడు సుకుమార్, తబితల కుమార్తె సుకృతి ఓణీల ఫంక్షన్ బుధవారం హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో జరిగింది. ఈ వేడుకకు పలువురు తెలుగు సినిమా ప్రముఖులు హాజరై, సుకృతిని ఆశీర్వదించారు. చిరంజీవి, రామ్ చరణ్ 'ఆచార్య' షూటింగ్ లో ఉన్నకారణంగా హాజరు కాలేదు. అల్లు అరవింద్, అల్లు శిరీశ్ ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక ఈ ఫ్యామిలీ ఫంక్షన్ కు స్టార్ హీరోలు మహేశ్ బాబు, ఎన్టీయార్, నాగ చైతన్య సతీసమేతంగా విచ్చేసి సుకృతిని ఆశీర్వదించారు. తెలుగులోని అగ్ర కథానాయకులతో సినిమాలు రూపొందించిన సుకుమార్... ప్రస్తుతం అల్లు అర్జున్ తో ముచ్చటగా మూడో సినిమాగా 'పుష్ప'ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే తన శిష్యుడు సానా బుచ్చిబాబును దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ నిర్మించిన 'ఉప్పెన' విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సినిమా టీమ్ సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు.