రేపు థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..

రేపు థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..

ప్రతి వారం సినిమాలు ఎక్కువగా శుక్రవారం విడుదల అవుతాయి. వారం అంతా కష్టపడి ఉన్న ప్రేక్షకులు వీకెండ్స్‌లో ఎంజాయ్ చేస్తారన్న ఉద్దేశ్యంతో మూవీ మేకర్స్ సినిమాలను శుక్రవారం విడుదల చేస్తారు. అలాగే ఈ శుక్రవారం కూడా అంటే రేపు మార్చి 5న కూడా దాదాపు 9 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ప్రేక్షకులను ఏ సినిమా ఎంత వరకు అలరిస్తుందో పక్కనపెడితే, రిలీజ్‌కు మాత్రం చాలా సినిమాలు సిద్దమయ్యాయి. వాటిలో టాలీవుడ్ యువ కథానాయకుడు సందీప్ కిషన్ నటించిన 25వ సినిమా ఏ1 ఎక్స్ ప్రెస్ కూడా ఉంది. అలానే రాజ్ తరుణ్ నటించిన పవర్ ప్లే. వాటిలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన క్లైమాక్స్ కూడా రేపే విడుదల కానుంది. ఇక సినిమాలను చూస్తే.. హరిప్రసాద్ జక్కా- ప్లే బ్యాక్, సాగర్ ఆర్కే- షాదీ ముబారక్, ఏ, తారకరత్న- దేవినేని, రాయ అండ్ ది లాస్ట్ డ్రాగన్(ఇంగ్లీష్ డబ్బింగ్’, ఓటీటీలో సీత ఆన్ రోడ్స్ సినిమాలు రేపు విడుదల కానున్నాయి. వీటిలో ఏ సినిమా విజయం సాధిస్తుందో వేచి చూడాలి.