బాలీవుడ్ పై కన్నేస్తున్న మన హీరోలు

బాలీవుడ్ పై కన్నేస్తున్న మన హీరోలు

టాలీవుడ్‌ మాస్‌ స్టార్స్‌ అంతా ఇప్పుడు బాలీవుడ్‌లో అదరగొట్టాలని ట్రై చేస్తున్నారు. అల్లు అర్జున్ నుంచి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ వరకు అంతా నార్త్‌లో పాగా వెయ్యాలని మాసీ ప్రాజెక్టులు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఉత్తరాదిన యూట్యూబుల్లోనూ, శాటిలైట్‌లోనూ బోల్డంత పాపులారిటీ సంపాదించుకున్న వీళ్లు బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర హంగామా చెయ్యగలరా అనే ప్రశ్నలు వస్తున్నాయి. 'డీజే, సరైనోడు' హిందీ డబ్బింగ్స్‌తో నార్త్త్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ముఖ్యంగా ఈ స్టైలిష్‌ స్టార్ డ్యాన్స్‌లకి బోల్డంత ఫాలోయింగ్ ఉంది. ఈ క్రేజ్‌ని క్యాష్‌ చేసుకోవడానికే ఇప్పుడు 'పుష్ప' సినిమాతో నార్త్‌కి వెళ్తున్నాడు అల్లు అర్జున్. ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌తో స్పెషల్‌ ఐడెంటిటీ సంపాదించుకున్న రామ్‌ హిందీ డబ్బింగ్ సినిమాలకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. రామ్ డబ్బింగ్‌ సినిమాలకి మిలియన్స్‌లో వ్యూస్‌ ఉన్నాయి. అందుకే స్ట్రయిట్‌ హిందీ మూవీతో నార్త్ ఆడియన్స్‌ని పలకరించాలనుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇక  రామ్‌ బాలీవుడ్‌ స్టార్ జాన్‌ అబ్రహంతో కలిసి చేసిన యాడ్‌ షూట్‌, ఒక రిహార్సల్‌ లాంటిదని చెప్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి తెలుగులో పెద్దగా స్టార్డమ్‌ లేదుగానీ, నార్త్‌ ఆడియన్స్‌లో మాత్రం ఈ హీరోకి సూపర్‌ క్రేజ్‌ ఉంది. ఈ హీరో చేసిన యాక్షన్‌ మూవీస్‌ తెలుగులో ఫ్లాప్‌ అయ్యాయి గానీ, హిందీ డబ్బింగ్స్‌ మాత్రం బాగానే క్లిక్ అయ్యాయి. అందుకే ఇప్పుడు బెల్లంకొండతో హిందీ నిర్మాతలు 'ఛత్రపతి'ని రీమేక్‌ చేస్తున్నారు. బన్నీ నుంచి బెల్లంకొండ వరకు అంతా యూట్యూబ్, శాటిలైట్ ఫాలోయింగ్‌ ధీమాతోనే బాలీవుడ్‌కి వెళ్తున్నారట. అయితే టీవీల్లో యూట్యూబ్‌ల్లో వీళ్ల సినిమాలు చూసిన ప్రేక్షకులు థియేటర్‌ వరకు వస్తారా, వీళ్ల కోసం టిక్కెట్లు తీస్తారా అన్నది ఆసక్తికరంగా మారుతోంది. అయితే సినిమాలో కంటెంట్‌ ఉంటే వీళ్లు కూడా ప్రభాస్‌లా సూపర్‌ క్రేజ్ తెచ్చుకుంటారు లేకపోతే కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.