'వకీల్ సాబ్' జడ్జిమెంట్... సినీ ప్రముఖుల ట్వీట్స్

'వకీల్ సాబ్' జడ్జిమెంట్... సినీ ప్రముఖుల ట్వీట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ 'వకీల్ సాబ్' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు హిట్ టాక్ రావడంతో పవన్ అభిమానులతో పాటు పలువురు సెలెబ్రిటీలు సైతం సినిమాపై ట్విట్టర్ వేదికగా తమ స్పందన తెలియజేస్తున్నారు. 'వకీల్ సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రెచ్చిపోయిన పవన్ భక్తుడు బండ్ల గణేష్ తన ట్వీట్ తో పవన్ అభిమానుల్లో జోష్ నింపారు. 'మాస్ కా బాప్... నో వర్డ్స్, నో ఆర్గ్యుమెంట్స్ ఓన్లీ జడ్జిమెంట్... బ్లాక్ బస్టర్ జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' అంటూ ట్వీట్ చేశారు. పవన్ వీరాభిమాని అయిన దర్శకుడు హరీష్ శంకర్ 'జాతర షురూ' అంటూ ట్వీట్ చేశారు. మరో దర్శకుడు అనిల్ రావిపూడి "వన్ మాన్' షో... వకీల్ సాబ్ జడ్జిమెంట్ పవర్ ఫుల్ బ్లాక్ బస్టర్" అంటూ ట్వీట్ చేశారు. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా తన బాబాయ్ పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు. మొత్తానికి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పవన్ మేనియా కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో 'వకీల్ సాబ్' బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలుకొడుతోందేమో చూడాలి మరి. 

ఇక 'వకీల్ సాబ్'లో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, అంజలి, నివేదా థామస్, అనన్య నాగేళ్ల, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషించారు. వాను శ్రీరామ్ దర్శకత్వం వహించగా... దిల్ రాజు బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.