దాసరికి చిత్రప్రముఖుల నివాళి

దాసరికి చిత్రప్రముఖుల నివాళి

మే 4న దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో ఆయన విగ్రహాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించారు చిత్రప్రముఖులు. ఈ కార్యక్రమంలో 'మా' అధ్యక్షులు వి.కె.నరేష్, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కొరియోగ్రఫర్ సత్య మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం తర్వాత పేదలకు అన్నదానం చేశారు.