తెలుగు పాప అంజలి.. ఇలా మారిందేంటి !

తెలుగు పాప అంజలి.. ఇలా మారిందేంటి !

టాలీవుడ్ ఇండస్ట్రీకి తెలుగమ్మాయిగా పరిచయమైన అంజలి.. అటు కోలీవుడ్ లోనూ రాణిస్తోంది. ప్ర‌స్తుతం అంజ‌లి సినిమాల‌తో పాటు ఓటీటీలో ప్ర‌సార‌మ‌వుతున్న వెబ్ సిరీస్‌ల‌లోను న‌టిస్తుంది. రీసెంట్ గా ‘వకీల్ సాబ్’ సినిమాలో ప్రముఖ పాత్రలో నటించింది అంజలి. అయితే ఎంతో బొద్దుగా క‌నిపించే ఈ ముద్దుగుమ్మ ఈ మ‌ధ్య చాలా సన్నగా మారింది. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉండే అంజలి.. తాజాగా తన లేటెస్ట్ పిక్స్ షేర్ చేసే సరికి అభిమానులు పరేషాన్ అయ్యారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో హోమ్లీగా ఆకట్టుకున్న అంజలి ప్రస్తుతం సన్నజాజి తీగలా మరి.. హాట్ ఫోటో షూట్స్ తో అభిమానుల్లో హీట్ పుట్టిస్తోంది. రీసెంట్ గా ‘నిశ్శబ్ధం’ సినిమాలో నటించిన అంజలి.. ఇప్పుడు గ్లామర్ పాత్ర‌ల‌కు సై అంటోందట.