జపాన్‌‌లో మంచు తుఫాను..

జపాన్‌‌లో మంచు తుఫాను..

టోక్యో: టోక్యోలో మంచు తుఫాను బీభత్సం సృష్టించింది. రోడ్డు పై ఉన్న కార్లు ఒక్కసారిగా గాలికి కొట్టుకొచ్చి ఒకదానితో మరొకటి ఢీకోట్టుకున్నాయి. ఈ ఘటన జపాన్ రాజధాని టొక్యోలోని మియాగీ ప్రాంతంలో చోటుచేసుకుంది. టోక్యోలో ఎక్కువ జనసంచారం ఉండే ప్రాంతాల్లో మియాగీ కూడా ఒకటి. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతాన్ని ఓ మంచు తుఫాను వణికించింది. దాదాపు గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగమైన గాలులు వీచాయి. దాంతో రోడ్డుపై ఉన్న వాహనాలు అదుపుతప్పాయి. వాటిని మళ్లీ అదుపులోకి తీసుకురావడం అసంభవంగా మారింది. ఇంతలోనే ఒకదానితో మరోకటి ఢీకోన్నాయి. ఈ ఘటనలో దాదాపు 134 కార్లు అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా సుమారు 17 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.