నేడు టీడీపీ కీలక భేటీ...

నేడు టీడీపీ కీలక భేటీ...

ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు... పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి చేపట్టనున్న గ్రామదర్శిని, గ్రామ వికాసం కార్యక్రమం, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు నేతలు. ఇక ఈ సమావేశం అనంతరం టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది... పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు.