స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు...

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు...

కరోనా సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరలు గత కొంతకాలంగా తగ్గుతూ వస్తున్నాయి.  అంతర్జాతీయంగా మార్కెట్లు కొంతమేర బలపడటంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ నిన్న ఈరోజు బంగారం ధరలు  స్వల్పంగా పెరిగాయి.  ఈరోజు హైదరాబాద్ లోని బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.  10 పెరిగి రూ. 46,310 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ.50,510 కి చేరింది  ఇక వెండి ధర మాత్రం ఈరోజు స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ.69,000కి పలుకుతుంది.