రూ.78కి 20జీబీ డేటా ఫ్రీ

రూ.78కి 20జీబీ డేటా ఫ్రీ

దేశీయ టెలికామ్ రంగంలో రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ దూకుడుని అడ్డుకొనేందుకు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. సరికొత్తగా రూ.78 ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద బీఎస్ఎన్ఎల్ ఉచిత ఇంటర్నెట్, కాలింగ్ సర్వీసులు అందిస్తోంది. ఈ ఉచితాలను అందుకొనేందుకు కస్టమర్లు రూ.78తో రీఛర్జీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ తో 10 రోజులపాటు రోజుకు 2జీబీ డేటా లేదా వాలిడిటీ గడువు మొత్తానికి 20జీబీ డేటా ఇస్తారు. రూ.78 బీఎస్ఎన్ఎల్ ప్లాన్ 22 బీఎస్ఎన్ఎల్ సర్కిళ్లలో లభ్యమవుతుంది. అయితే ఈ ప్లాన్ కింద బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న డేటా 4జీ కాదు. కస్టమర్లు 2జీ, 3జీ డేటానే వాడుకోగలుగుతారు.