షాకింగ్‌: కరోనాతో ఏపీ ఎంపీ దుర్గా ప్రసాద్‌ మృతి

షాకింగ్‌: కరోనాతో ఏపీ ఎంపీ దుర్గా ప్రసాద్‌ మృతి

కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తోంది.. సామన్యులతో పాటు.. వీఐపీల ప్రాణాలు కూడా తీస్తోంది కరోనా వైరస్... కరోనాతో తిరుపతి ఎంపీ బల్లి దర్గా ప్రసాద్ కన్నుమూశారు.. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితమే మృతిచెందారు దుర్గా ప్రసాద్... 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా విజయం సాధించారు దుర్గా ప్రసాద్... 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించిన దుర్గా ప్రసాద్... 28 ఏళ్లకే ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లా గూడురు నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. ఇక, 1994లో చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు.. చంద్రబాబు హయాంలో విద్యాశాఖ మంత్రిగా సేవలు అందించారు.. గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన ఆయన.. తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కొన్ని రోజుల క్రితం కరోనాబారిన పడిన దుర్గాప్రసాద్.. కరోనా నుంచి కోలుకున్నా... ఇతర అనారోగ్య సమస్యలతో మృతిచెందినట్టుగా తెలుస్తోంది.