టీటీడీలో మరో వివాదం..

టీటీడీలో మరో వివాదం..

టీటీడీలో మరో వివాదం చోటు చేసుకుంది.  తనకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించారు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలదీక్షితులు. గొల్లపల్లి వంశం నుంచి తాను ప్రధాన అర్చకుడిగా కొనసాగుతుండగా తమ కుటుంబం నుంచే రమణదీక్షితులను ప్రధాన అర్చకుడిగా నియమించడాన్ని హైకోర్టులో సవాలు చేశారు వేణుగోపాలదీక్షితులు. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ, రమణదీక్షితులను పేర్కొన్నారు వేణుగోపాలదీక్షితులు. అయితే ఈ ఫిల్ ను స్వీకరించి ప్రభుత్వం, టీటీడీ, రమణదీక్షితులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా కొనసాగుతూ ప్రభుత్వం, టీటీడీపై కోర్టును ఆశ్రయించడంతో ఈ వివాదం సంచలనంగా మారింది.